పవన్ సినిమాలలో నటిస్తే తప్పేంటి..?: ఉండవల్లి

పవన్ సినిమాలలో నటిస్తే తప్పేంటి..?: ఉండవల్లి

2019 ఎన్నికలలో జనసేనకి ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. ప్రజల కోసం, ప్రజా సమస్యల పై పోరాటానికి సిద్దపడ్డ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత, రాజకీయాల్లో చాలా బిజీ అయ్యారు. అందులో భాగంగానే.. అనేక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో విరుచుపడ్డారు. ఇసుక సమస్య, ఇంగ్లిష్ మీడియం సమస్యలపై ఒకానొక టైంలో జగన్ సర్కార్ ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం కూడా తెలిసిందే..

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వల్ల జనసేన నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్లిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జనసేన, బీజేపీతో పొత్తు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలపై మొగ్గు చూపడంతో జనసేనకు చెందిన లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం సరైన నిర్ణయమేనా..? అనే అంశంపై చర్చ తెరపైకి వచ్చింది. దీని పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో జయప్రకాశ్ నారాయణ, పవన్ నిర్ణయాన్ని సమర్ధించగా తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పవన్ సినిమాల్లో నటించే నిర్ణయం సరైందే.. అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆదే విధంగా జనసేన-బీజేపీ పొత్తు గూర్చి మాట్లాడుతూ.. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Read More: జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ

more updates »