వేసవిలో అలరించనున్న బాబాయి-అబ్బాయి సినిమాలు

వేసవిలో అలరించనున్న బాబాయి-అబ్బాయి సినిమాలు

బాబాయి-అబ్బాయి దగ్గుబాటి వెంకటేష్ మరియు రానా తమ సినిమాలు 'నారప్ప మరియు విరాట పర్వం' తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళ ఇద్దరి సినిమాలలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు ఉన్నాయి.

వెంకీ సినిమా 1980 కాలానికి సంబంధించినదిగా, రానా సినిమా 1990 కాలానికి సంబంధించినదిగా అర్థం అవుతున్నాయి. ఇద్దరి సినిమాలలోనూ జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించటం ఒక విశేషం.

అయితే వీళ్ళ ఇద్దరి సినిమాలు ఈ వేసవికి ఒకేసారి రిలీజ్ అవ్వనున్నాయి..... ఈ బాబాయి -అబ్బాయి సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో వేచి చూడాలి.

more updates »