హిప్పీ మూవీ రివ్యూ

Article

నటీనటులు : కార్తికేయ, దిగంగా సూర్యవంశీ, జాబ్జా సింగ్, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : టిఎన్ కృష్ణ
నిర్మాత : కలై పులి. థాను
సంగీతం : నివాస్ కె ప్రసన్న
రేటింగ్ : 2/5

కథ :

దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ) బాక్సర్‌గా ఉంటూ జేడీ చక్రవర్తి సాఫ్ట్ వేర్ కంపెనీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహతో (జబ్బా సింగ్) ఆల్ రెడీ లవ్ లో ఉంటాడు. అయితే స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశి)ను చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. ఇక ఆమెను ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆముక్తమాల్యద దేవ్ ప్రేమను అంగీకరిస్తోంది. అయితే తన చెప్పిన ప్రతి పనిని చెయ్యాలని షరతు పెడుతుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వస్తాయి. వాటి మూలంగా వారి జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? ఈ క్రమంలో వారి మధ్యన ఆనంద్ ( జేడీ చక్రవర్తి) ఎలాంటి పాత్రను పోషించాడు ? ఇంతకీ వాళ్లిద్దరూ మళ్లీ కలిసారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

దిగంగ‌న అందం
యాక్షన్
నేప‌థ్య సంగీతం
ఛాయాగ్రహ‌ణం

మైనస్ పాయింట్స్:

క‌థ‌, క‌థ‌నం
కామెడీ
ప‌తాక స‌న్నివేశాలు

నటీనటులు :

కార్తికేయ న‌ట‌న హుషారుగా సాగుతుంది. ‘ఆర్‌ఎక్స్‌100’లో చేసిన పాత్రకి భిన్నంగా మ‌రింత ఉత్సాహంగా క‌నిపించాడు. హిప్పీ పాత్రలో చ‌క్కగా ఒదిగిపోయాడు. కాక‌పోతే కార్తికేయ సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని చూపించడంపైనే మ‌రీ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టున్నారు ద‌ర్శకుడు. అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పించారు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు హీరో. దిగంగ‌న అందం, న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఆమె ప్రతీ స‌న్నివేశంలో అందంగా క‌నిపించారు. ద్వితీయార్ధంలో ఆమె న‌ట‌న కూడా మెప్పిస్తుంది. బాస్ అర‌వింద్ పాత్రలో జేడీ చ‌క్రవ‌ర్తి ఒదిగిపోయారు. తెలంగాణ యాస మాట్లాడుతూ ఆయ‌న పండించిన హాస్యం మెప్పిస్తుంది. కానీ ఆయ‌నతో చెప్పించిన సంభాష‌ణ‌లు కొన్ని ప్రేక్షకుల‌కు మింగుడు ప‌డ‌ని విధంగా ఉంటాయి. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ చిన్న పాత్రల్లో మెరిశారు. వెన్నెల‌ కిషోర్ పాత్రతో పెద్దగా హాస్యం పండ‌లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు టిఎన్ కృష్ణ కొన్ని ప్రేమ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. నివాస్ ప్రసన్న పాటలు గుర్తుంచుకునేలా లేవు కానీ.. పర్వాలేదనిపిస్తాయి. సినిమాలో పాటలే ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. గోవా ఎపిసోడ్ బాగా తీశాడు. సాంకేతికగంగా ‘హిప్పి’లో క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ చూశాక మాత్రం కలైపులి థాను లాంటి అగ్ర నిర్మాత ఇలాంటి సినిమా చేయడానికి కారణం కనిపించదు. ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం తప్పితే ఇలాంటి కథ విని సినిమా చేయడంలో ఆంతర్యం కనిపించదు.

తీర్పు :

టిఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగన సూర్యవంశి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే థీమ్ తో పాటు సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, కార్తికేయ నటన, కొన్ని డైలాగ్ లు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో కథకు అనవసరమైన కామెడీ అండ్ ప్రేమ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, అలాగే స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

Prev 'భారత్‌' మూవీ రివ్యూ
Next నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది: అనన్య
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.