ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించాలని ప్రముఖ సినీ గాయని పి.సుశీల ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ పేరు తెచ్చుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు ఈ సందర్భంగా సుశీల శుభాకాంక్షలు చెప్పారు. పేదలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జగన్.. కళాకారులకు కూడా సహాయం చేయాలని ఆమె కోరారు. వైఎస్.. ట్రస్టు పెట్టి తనకు ఎంతో సహాయం చేశారని సుశీల కొనియాడారు. ఆ ట్రస్టుకు ఇప్పుడు జగన్ కూడా సహాయం చేయాలని ఆమె కోరారు.
Please submit your comments.