హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీన లేఖను అందజేశారు. స్పీకర్ ను పన్నెండు మంది ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకట రమణ, చిరుమర్తి లింగయ్య, సురేందర్, పైలట్ రోహిత్ రెడ్డి కలిశారు.
స్పీకర్ ను కలిసిన అనంతరం మీడియాతో రేగా కాంతారావు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం చేశామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి మారడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు తగ్గింది. ఇక కాంగ్రెస్‌లో మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొదం వీరయ్యలు ఉన్నారు.
Please submit your comments.