వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. పాకిస్థాన్ జట్టు సభ్యులతో పాటు మరో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు జరిమానా విధించారు.ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిర్ణీత సమయం కన్నా ఒక ఓవర్‌ను ఆలస్యంగా వేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కూడా జరిమానా విధించారు. స్లో ఓవర్‌రేట్ కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించారు. అలాగే జట్టులోని మిగతా ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజుల్లో 10శాతం జరిమానా వేశారు. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో నిషేధిత వ్యాఖ్యలు లేదా అసభ్యకరంగా మాట్లాడినందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌కు 15శాతం ఫైన్ వేశారు. అలాగే అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15శాతం జరిమానా పడింది. ఫైన్‌తో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను కూడా ఈ ఇద్దరి ఖాతాల్లో వేశారు.
Please submit your comments.