చంద్రబాబుకు కలిసిరాని 23

హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెబ్బకు టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. చరిత్రలో భారీ వైఫల్యాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. గురువారం (మే 23) వెల్లడైన ఫలితాల్లో ఏపీ ప్రజలు జననేత జగన్‌కు జైకొట్టారు. ‘'23' చరిత్రలో నిలిచిపోయే సంఖ్య..! 23 మందిని కొన్నావు. ఈ ఎన్నికల్లో 23 మందే గెలిచారు. కౌటింగ్‌ 23నే అయింది’ అంటూ వేదాంత ధోరణిలో చంద్రబాబుకు చురలంటిస్తున్నారు. ఫలితాల వెల్లడి మే23న కాకుండా ఈ నెల 31 జరిగితే బాగుండునని మరికొందరు అంటున్నారు. కనీసం అప్పుడైనా చంద్రబాబుకు 31 సీట్లు దక్కేవని జాలి చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కోడికత్తి అని ఎద్దేవా చేసిన చంద్రబాబును.. ప్రజలు కోడికత్తితో కసితీరా పొడిచారని మరొకరు పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో తమ అధినేత అనుసరించిన వ్యూహాలన్నీ తల్లకిందులయ్యాయనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Prev వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి!
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.