ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?

Article

రాజకీయనాయకులు ఏంమాట్లాడినా,ఏం చేసినా దానివెనుక ఏదో పరమార్ధం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇటీవల ఇవియంల పై విపరీతధోరణి లో ప్రవర్తిస్తుండటం చాలామందికి ఆశ్చర్యంగా వుంది. సంస్కరణలు,సాంకేతిక ని అందిపుచ్చుకోవటం ఆయనకు అత్యంత ప్రీతికారకాలుగా అందరూ చెబుతూ వుంటారు. అటువంటి వ్యక్తి ఇవియం ల పై రోజుకో రాద్ధాంతం చేయటం చూస్తుంటే ఆయన ఓడిపోవటం ఖాయమని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతవరకూ ఓకే . కానీ ఇప్పుడు ప్రశ్నల్లా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్లు? రెండుసార్లు సుప్రీం కోర్టు కెళ్ళినా ఫలితం లేకపోయింది. అయినా వదలకుండా అందరు రాజకీయనాయకులను కలవటం, ఎన్నికల కమిషన్ ని కలవటం అదీ ఒక్కరోజులో లెక్కింపు ప్రారంభం అవుతున్న సమయం లో . ఈ విపరీత చర్యలు ఏమి చెబుతున్నాయి?

రాజకీయపరిశీలకుల దృష్టిలో ఈ చర్యలు వింతగా వున్నాయి. మాయావతి , మమతా, స్టాలిన్ ,దేవెగౌడ , అఖిలేష్ యాదవ్ ఎవ్వరూ నిన్నటి ఎన్నికల కమిషన్ మీటింగ్ కి రాకపోవటం దేనికి సంకేతం? ఏదో తప్పదన్నట్టు వాళ్ళ ప్రతినిధులను పంపించటం మినహాయించి వాళ్ళ వైపునుండి పెద్దగా స్పందన లేకపోవటం , అయినా వాళ్ళందరి దగ్గరకు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరగటం చూసిన వాళ్లకు చంద్రబాబునాయుడు ఎంత నిరాశలో వున్నాడో అర్ధమవుతుంది. ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం వున్నవాడికైనా చంద్రబాబు ప్రవర్తన వింతగా , కొన్ని సార్లు వికృతంగా కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్లు రాజకీయాల్లో వున్న వ్యక్తి, ముఖ్యమంత్రి పదవి లో వున్న వ్యక్తి , ఇదే ఇవియం లతో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన వ్యక్తి అసలు ఇవియం లలో ఏదో గోల్ మాల్ జరుగుతుందని చెబుతుంటే ఇంతకన్నా హాస్యాస్పదం వేరొకటి ఉండదు. చివరకు ఎక్కడిదాకా వెళ్లాడంటే బయటినుంచి ఇవియం లను నియంత్రించవచ్చని చెప్పటందాకా. అదేగనుక జరిగేటట్లయితే 2014 లో మోడీ, చంద్రబాబునాయుడు లు అధికారం లోకి రారు. ఇది చంద్రబాబునాయుడుకి తెలియదని అనుకోలేము. మరి ఈ ఆగమంతా ఎందుకు చేస్తున్నట్లు?

ఏదో పరమార్ధం వుండివుండాలి. అదేంటి? ఫలితాలు వచ్చిన తర్వాత తనకు అనుకూలంగా రాకపోతే వాటిల్లో మోసం జరిగిందని తిరస్కరిస్తాడా? చివరకు కుంటిసాకులు చెప్పి ఎన్నికల లెక్కింపు ప్రక్రియను ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఓడిపోయే మిగతా ప్రతిపక్షాలు చంద్రబాబునాయుడు మాటలకు ఎందుకైనా మంచిదని తలూపటం చూస్తుంటే ఈ ఆగం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనిపిస్తుంది. రేపు లెక్కింపు పూర్తయ్యేటప్పటికీ ఏదయినా పేచీ పెట్టాలనే ఆలోచన ఉందా అని అనుమానమొస్తుంది. ఏదయినా సాంకేతిక పరమైన కారణాలతో మళ్ళాకోర్టు గుమ్మం తొక్కుతాడా? ఏ పరమార్ధం లేకుండా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తాడు? చివరకు సుప్రీం కోర్టు కూడా ఏమిటీ న్యూసెన్స్ అని వ్యాఖ్యానించిందంటే అందరికీ ఎంత విసుగు తెప్పిస్తున్నాడో అర్ధమవుతుంది. ఈ మొత్తం వ్యవహారం లో చివరకు చంద్రబాబు నాయుడు జోకర్ గా మిగలటం ఖాయంగా కనిపిస్తుంది. పాపం చంద్రబాబునాయుడు!

Prev యూకేలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న 5జీ సేవ‌లు
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.