- విడుదల: మే 31, 2019
- నిర్మాణం: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏపీ, టీఎస్ డిస్ట్రిబ్యూషన్: శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్
- నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్
- సంగీతం : యువన్ శంకర్‌రాజా,
- సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్,
- ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్,
- ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్,
- నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు,
- దర్శకత్వం: శ్రీరాఘవ.
ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీ రాఘవ. ఆయన సినిమా వస్తుందంటే అందులో తప్పకుండా ఏదో ఒక కొత్త యాంగిల్ ఉంటుందని జనాల నమ్మకం. అలాగే చిన్నా పెద్దా తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. ఓ వైపు మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు ఫ్యామిలీస్‌కి దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `ఎన్.జి.కె`. రకుల్ ఫ్రీత్‌సింగ్, సాయి పల్లవి ఇద్దరూ సూర్య సరసన తొలిసారి నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పవర్‌ప్యాక్డ్‌గా ఉంది. మరి సినిమా కూడా అలాగే ఉంటుందా? కమాన్ లెట్స్ రీడ్...
కథ:నందగోపాల కృష్ణ అలియాస్ ఎన్.జి.కె(సూర్య) ఊర్లో సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు(ఉమా పద్మనాభన్ నిరల్‌గల్ రవి), భార్య గీతాకుమారి(కుమారి) సపోర్ట్‌గా ఉంటారు. మంచి చేసే ఎన్.జి.కె అంటే నచ్చని వాళ్లు అతనిపై, అతని మనుషులపై దాడి చేస్తారు. దాంతో సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే(ఇళవరసు) దగ్గరకు వెళితే, తన పార్టీలో జాయిన్ అయితేనే సహాయం చేస్తానని అంటాడు. విధిలేక గోపాల్ ఎమ్మెల్యే దగ్గర చేరుతాడు. ఎమ్మెల్యే గోపాల్‌ను మానసికంగా బాధపెడుతుంటాడు. దాంతో రాజకీయాల్లోకి తాను రావాలనుకుని గోపాల్ ఎమ్మెల్యే చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు. ఎన్.జి.కె గురించి తెలుసుకున్న పార్టీ అధిష్టానం పి.ఆర్ వనిత(రకుల్ ప్రీత్ సింగ్) ఎన్.జి.కెని ఓ సహాయం అడుగుతుంది. ఆమె కోరే సహాయం ఏంటి? దాని వల్ల ఎన్.జి.కె ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు నందగోపాల కృష్ణ అనుకున్నది సాధించాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: సూర్య పాత్ర సినిమాకు ప్రధానమైన బలంగా నిలిచింది. ఇప్పటి వరకు సూర్య టచ్ చేయని జోనర్ పొలిటికల్. అలాగే శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రమిది. సూర్య డైరెక్టర్, స్క్రిప్ట్‌కు లోబడి నటించనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడో హీరోయిజం ఎలివేషన్‌లేకుండా సినిమాను, కథ ప్రకారం పాత్రను డిజైన్ చేశారు. సూర్య పాత్రలో ఓ ఇన్‌టెన్స్ కనపడుతుంది. క్లైమాక్స్‌లో సూర్య నటన బావుంది. ఇక సూర్య భార్యగా నటించిన సాయిపల్లవి మొగుడితో పెర్‌ఫ్యూమ్ గురించి గొడవపడుతూ ఉంటుంది. ఆ విషయంలో అంతగా గొడవ పడాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. సరే! అనుమానంతో గొడవ పడిందే అనుకుందాం. సూర్య కోపంతో చెప్పినప్పుడు ఆమె తన భర్త మంచివాడు అంటూ కితాబిచ్చేస్తుంది.
ఇక రకుల్ పాత్రకు ఇంట్రడక్షన్‌లో ఇచ్చిన బిల్డప్‌కు, కథా గమనంలో ఆమె పాత్ర సాగే తీరుకు సంబంధమే ఉండదు. ఇక మెయిన్ విలన్‌గా నటించిన దేవరాజ్, ఇతర పాత్రధారులు పాత్ర పరిధి మేర నటించారు. దర్శకుడు శ్రీరాఘవ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఎలాంటి ఇన్‌టెన్షన్ కనపడుతుందోనని అందరం అనుకున్నాం. కానీ సినిమాలో ఏం చెప్పాలనుకన్నాడనేది ఓ క్లారిటీతో లేకుండా పోయింది. పాత్రలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సన్నివేశాలకు లింకులుండవు. యువన శంకర్ రాజా ట్యూన్స్‌లో రెండు సాంగ్స్ బాగానే ఉన్నాయి. తెలుగు సాహిత్యం అర్థం కాలేదు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
-
ప్లస్ పాయింట్స్:
- సూర్య
- కెమెరా వర్క్
-
మైనస్ పాయింట్స్:
- పాత్రల చిత్రీకరణ
- సంగీతం, నేపథ్య సంగీతం
- దిశ, గమ్యం లేని కథనం
- అర్థం కాని పాటలు
Please submit your comments.