ఓ పక్క ఏపీ మంత్రివర్గం కొలువు తీరుతున్న వేళ.. అందరి దృష్టి అటు వైపు ఉన్న వేళ.. జనసేన పార్టీలో చోటుచేసుకున్న ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఏపీ మంత్రివర్గంలో పదవులు దక్కించుకున్న మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.
బాబు సర్కారులో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ఎన్నికలకు ముందు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అభ్యర్థిగా రావెల గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు రావెల లేఖలో వెల్లడించారు. రావెల తీసుకున్న నిర్ణయం పవన్ కు షాకింగ్ గా మారుతుందని చెప్పాలి. మరోవైపు.. ఇటీవల పవన్ కల్యాణ్ నిర్వహించిన పార్టీ సమావేశానికి నాదెండ్ల మనోహర్.. మాజీ జేడీ లక్ష్మీనారాయణలు కనిపించకపోవటం హాట్ టాపిక్ గా మారిన వేళ.. తాజాగా పార్టీకి రావెల రాజీనామా చూస్తే.. జనసేనలో కొత్త పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న భావన కలగటం ఖాయం.
Please submit your comments.