న‌రేంద్ర‌మోదీ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్

Article
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’. మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోషన్ కార్య‌క్రమాలు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, నటుడు వివేక్‌ ఒబెరాయ్ చేతుల మీదుగా పోస్ట‌ర్ విడుద‌ల కాగా, తాజాగా చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో మోదీ ప‌డిన క‌ష్టాలు , చాయ్ వాలా నుండి ఆయ‌న ప్ర‌ధాన మంత్రిగా ఎదిగిన తీరు త‌దిత‌ర అంశాల‌ని చూపించారు. ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్రంలో మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. మోదీ బాల్యం, ఆ త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌వేశం గురించి సినిమాలో చూపించ‌నున్నారు. గుజ‌రాత్ సీఎం నుంచి 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని కూడా చిత్రంలో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు .
Prev సాహూ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేసిన ప్రభాస్
Next మరో హీరోను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.