సూపర్ కింగ్స్ టీం పై సూర్యని ప్రశ్నించిన రైనా

తమిళ నటుడే అయినా, దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైన సూర్య, కొత్త చిత్రం 'ఎన్.జీ.కే' ఈ నెలాఖరులో విడుదలకానుండగా, సినిమా ప్రమోషన్ లో ఉన్న ఆయనకు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా స్వీట్ షాకిచ్చాడు. సూర్య తన అభిమానులతో ట్విట్టర్ మాధ్యమంగా మాట్లాడుతున్న వేళ, సురేశ్ రైనా మధ్యలో దూరిపోయాడు. అభిమానుల ప్రశ్నలకు సూర్య సమాధానాలు ఇస్తుంటే, రైనా నుంచి వచ్చిన ప్రశ్న కనిపించడంతో సూర్య ఆశ్చర్యపోయాడు. "మీకు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ లో ఏ క్రికెట‌ర్ అంటే ఇష్టం?" అని సూర్య‌ను రైనా ప్ర‌శ్నించాడు. అయితే, ప్రశ్నకు సమాధానం చెప్పే విషయాన్ని పక్కనబెడితే, రైనా అలా ట్విట్టర్ లోకి రావడాన్ని తొలుత నమ్మలేకపోయిన సూర్య, ఆపై జవాబు చెప్పాడు. "మీకు నాతో మాట్లాడ‌టానికి స‌మ‌యం దొరికిందా? నేను న‌మ్మ‌లేకున్నాను. మీ పాప గ్రేసియాతో పాటు అంద‌రినీ అడిగాన‌ని చెప్పండి. చెన్నై సూప‌ర్‌ కింగ్స్‌ లో నాకు ధోని అంటే ఇష్టం. నేనేమీ కావాల‌ని చెప్పడం లేదు. నేను ఎప్ప‌టికీ సూపర్‌ కింగ్స్ ఫ్యాన్ నే. జట్టులో నేను క‌లిసిన తొలి ఆట‌గాడు ధోని. ఆ స‌మ‌యంలో మీరు నాకు హ‌లో చెప్పారు. మ‌నం క‌లిసి దిగిన ఫోటోను నేను భ‌ద్రంగా దాచుకున్నాను" అని సూర్య చెప్పుకొచ్చాడు.
Prev న‌రేంద్ర‌మోదీ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్
Next మరో హీరోను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.