'సీత' యాక్ష‌న్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Article
బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తేజ తెర‌కెక్కించిన చిత్రం సీత‌. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశామని అంటుంది చిత్ర బృందం . సోనూసూద్ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర పోషించ‌గా, మన్నారాచోప్రా ముఖ్య పాత్ర‌లో న‌టించారు. మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో కాజ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనీల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ అద్భుత‌మైన సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Prev తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
Next మరో హీరోను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.