వైద్య, ఆరోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

Article
వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరును ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ’ గా మార్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వైద్యరంగంలో ప్రైవేటు భాగస్వామ్యం తగ్గించి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వైద్యం అందేలా చూడాలన్నారు.
Prev హైదరాబాద్ లో ఆకర్షిస్తున్న 'కేసీఆర్ జగన్' భారీ ప్లెక్సీ
Next స్వరూపానంద స్వామిని దర్శించుకున్న సిఎం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.