అధికారులతో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు

సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ పనుల్లో బిజీ అయ్యారు. సెక్రటేరియట్ ఇంకా రెడీ కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంటి నుంచే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు సీఎం జగన్. మూడు రోజులుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఇంట్లో ఉండే సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో సమీక్ష చేస్తున్న అధికారులకు ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లోనే అధికారులు, ఉన్నతాధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని, తాను ఏం తింటానో అదే అందరికీ పెట్టాలని ఆదేశించారంట సీఎం జగన్.

మధ్యాహ్నం సమయంలో సమీక్షలు చేసే అధికారులు షాక్ కు గురి అవుతున్నారు. గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని.. గంటలు గంటలు సమీక్షలు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చావకొట్టేవారని చెప్పుకుంటున్నారు అధికారులు. సమీక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయినా.. గంటలోనే క్లోజ్ చేస్తున్నారని.. సూచనలు, సలహాలు, అమలులో సాధ్యసాధ్యాలు ఏంటో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ గడువు ఇచ్చి పంపుతున్నారని చెప్పుకుంటున్నారు అధికారులు. మాట్లాడే సమయంలో ఆయన పిలుపు, మాటతీరు కూడా మనస్సుకు హత్తుకునే విధంగా ఉంటుందని.. గతంలోని సీఎంలతో పోల్చి చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారంట.

Prev రైతుబందు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Next స్వరూపానంద స్వామిని దర్శించుకున్న సిఎం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.