విజయవాడ: బెజవాడ కనకదుర్గ గుడి హుండీలో చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం అమ్మవారి కానుకలు లెక్కించే సమయంలో కానుకలతో పాటు కొంత నగదు కూడా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. దుర్గగుడి హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసులో సింహాచలం అన్నపూర్ణతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రూ. 10వేల నగదు కూడా చోరీ చేసినట్లు నిర్ధారించారు. చోరీ చేసిన నగదును మార్గమధ్యలో అన్నపూర్ణ మరో ఉద్యోగికి అందజేసింది. దీంతో అన్నపూర్ణతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హుండీ లెక్కింపు సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
Please submit your comments.