ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది.
కాట్రెల్ వేసిన తర్వాత ఓవర్లో గ్లెన్ మాక్స్ వెల్ కొట్టిన షాట్ కీపర్ చేతుల్లో పడింది. 36 పరుగుల దగ్గర ఉస్మాన్ ఖ్వాజా(13) ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు.ఏడు, ఎనిమిది ఓవర్లలో ఆస్ట్రేలియా వరసగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 4వ ఓవర్ చివరి బంతికి 26 పరుగుల దగ్గర ఓపెనర్ డేవిడ్ వార్నర్(3) కూడా అవుట్ అయ్యాడు. 6 పరుగులు చేసిన ఫించ్, ఒషానే థామస్ బౌలింగ్‌లో కీపర్ షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. 3వ ఓవర్లో 15 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు మొదటి ఓవర్లోనే 6 ఎక్స్‌ట్రాలు వచ్చాయి.
Please submit your comments.