పెళ్లి పీటలెక్కనున్న రాజ్ తరుణ్

Article

తెలుగు తెరపై కెరియర్ ఆరంభంలోనే దూకుడు చూపించిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ పేరు కూడా చెప్పుకోవచ్చు. వరుస సినిమాలతో యూత్ లో క్రేజ్ ను పెంచుకున్న రాజ్ తరుణ్ కి, ఆ తరువాత వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'ఇద్దరి లోకం ఒకటే' చేస్తోన్న ఆయన, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా ట్విట్టర్ లో చాట్ చేసిన ఆయన అభిమానులకి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే పెళ్లికూతురు ఎవరి అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? చిత్రపరిశ్రమకి సంబంధించినవారి అమ్మాయా? బయట అమ్మాయా? అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. త్వరలోనే ఆ విషయాలు కూడా చెబుతాడేమో చూడాలి.

Prev సూపర్ కింగ్స్ టీం పై సూర్యని ప్రశ్నించిన రైనా
Next హృతిక్‌ రోషన్‌ సినిమా సెట్‌లో ఉద్రిక్తత
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.