రైతుబందు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Article

తెలంగాణలో రైతుబందు పథకానికి రూ. 6900కోట్ల నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ ముఖ కార్యదర్శి సీ పార్థసారథీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఏడాది నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు పథకం అమలుకానుంది. ఖరీఫ్, రబీ పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు.

తెలంగాణ సిఎం కెసిఆర్‌ గతేడాది సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఈ వానకాలం నుంచి దానిని రూ.5 వేలకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీఇచ్చారు. అందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలం నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకు అందజేస్తారు. ఆర్బీఐకి చెందిన ఈకుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తామని పార్థసారథి తెలిపారు.

Prev సిరియాలో మరోసారి బాంబు పేలుడు..14 మంది మృతి
Next స్వరూపానంద స్వామిని దర్శించుకున్న సిఎం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.