సిరియాలో మరోసారి బాంబు పేలుడు..14 మంది మృతి

Article
సిరియాలో మరోసారి పేలుళ్లలు జరిగాయి. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుడులో పది మంది మరణించిన విషయం మరువక ముందే మరో కారు బాంబు జరిగింది. ఈ ఘటన సిరియాటర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని అజాజ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో కనీసం 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి సమీపంలో దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Prev వైద్య, ఆరోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
Next స్వరూపానంద స్వామిని దర్శించుకున్న సిఎం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.