- టైటిల్ : 118
- జానర్ : థ్రిల్లర్
- తారాగణం : కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను
- సంగీతం : శేఖర్ చంద్ర
- దర్శకత్వం : కేవీ గుహన్
- నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు
కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మరో సక్సెస్ సాధించాడా?
కథ: గౌతమ్ (కల్యాణ్‌రామ్) ఓ జర్నలిస్ట్. తరచూ తనకో కల వస్తుంటుంది. ఆ కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్) కనిపిస్తుంటుంది. కొంతమంది దుండగులు ఆమెను చంపాలనుకోవడం, ఓ కారుని లోయలోకి తోసేయడం.. ఇదీ ఆ కల. అయితే కలలో చూసిన ప్రతీ ప్రదేశం తన నిజ జీవితంలోనూ తారసపడుతుంటుంది. లోయలో కారు కూడా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా ఉండే ఉంటుందన్నది గౌతమ్ గట్టి నమ్మకం. మరి ఆ నమ్మకం నిజమైందా? కలలో కనిపించిన అమ్మాయి నిజంగానే ఉందా? ఉంటే ఆమె ఎవరు? ఆమెకు ఎదురైన ఆపద ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘118
’నటీనటులు : కల్యాణ్‌రామ్ ఇదివరకెప్పుడూ చేయని పాత్రలో కనిపించాడు. తన లుక్ బాగుంది. సహజంగా నటించడానికి ప్రయత్నించాడు. నివేదా ఉండేది కాసేపే. కానీ, సినిమా మొత్తం ఆ పాత్ర తాలుకూ ప్రభావం ఉంటుంది. గౌతమ్ ప్రియురాలి పాత్రలో షాలినీ పాండే నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. ప్రభాస్ శీను నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. రాజీవ్ కనకాల, ‘ఛమక్’ చంద్ర, నాజర్ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
గుహన్ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి బలం. పట్టు సడలని కథనంతో ఆసక్తి రేకెత్తించాడు. కాకపోతే.. లాజిక్కుల్ని వదిలేసి ఈ సినిమా చూడాలి. ఒకే ఒక్క పాట ఉంది. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. మాటల్లో ఛమక్కులు ఎక్కడా కనిపించలేదు. గుహన్ స్వతహాగా కెమెరామెన్ కాబట్టి, ఆ విభాగానికీ మంచి మార్కులు పడిపోతాయి.
విశ్లేషణ : సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్ మార్క్స్ సాధించాడు. స్టైలిష్ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
-
ప్లస్ పాయింట్స్ :
- కల్యాణ్ రామ్, నివేదా థామస్ నటన
- నేపథ్య సంగీతం
-
మైనస్ పాయింట్స్ :
- సెకండ్ హాఫ్ లో లాజిక్ లేకపోవడం
Please submit your comments.