'మహర్షి' హిట్ ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్

Article

తన భార్య నమ్రత, ఆమె సోదరి శిల్పా శీరోద్కర్ లతో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు దిగిన ఓ పిక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ పిక్ లో మహేశ్ ఎంతో క్యూట్ స్మైల్ తో కనిపిస్తుండటమే ఇందుకు కారణం. తాను నటించిన 'మహర్షి' చిత్రం గతవారంలో విడుదలై, కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న వేళ, ఆ ఆనందంలో ఉన్న మహేశ్, ఆ సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ పిక్ దిగినట్టు తెలుస్తోంది.

నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పిక్ ను షేర్ చేసుకోగా, అభిమానులు ఖుషీ అయిపోయారు. ఈ పిక్ అద్భుతమంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా, శిల్పా శిరోద్కర్ గతంలో మోహన్ బాబు సరసన 'బ్రహ్మ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, నేడు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో అభిమానులతో కలిసి మహేశ్ సినిమాను చూడనున్నారు.

Prev మహేశ్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించిన ఉప రాష్ట్రపతి
Next దిషా పటాని లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ స్టిల్స్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.