- నటీనటులు:నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేశ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
- సంగీతం : గోపి సుందర్
- నేపథ్య సంగీతం : తమన్
- దర్శకత్వం : శివా నిర్వాణ
- నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య, సమంత. వీళ్లు కలిసి నటించిన ప్రతి సినిమాలోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీనే హైలైట్‌గా నిలిచింది. ఇదివరకు ప్రేమకథల్లోనే నటించిన చైతూ, సమంత... పెళ్లి తర్వాత తొలిసారి కలిసి ‘మజిలీ’ చేశారు. ఇది మాత్రం భార్యాభర్తల నేపథ్యంలో సాగే కథ. ‘నిన్ను కోరి’తో మెప్పించిన శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రేమికులుగా చక్కగా ఒదిగిపోయిన ఈ జోడీ భార్యాభర్తలుగా ఎలా నటించారు? ‘మజిలీ’ ఎలా ఉంది?
కథ : పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువుతూ ఎలాగైన రైల్వేస్ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు.
ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల కారణంగా పూర్ణ.. శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్నా.. ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. చివరకు పూర్ణ, శ్రావణికి ఎలా దగ్గరయ్యాడు? పూర్ణలో మార్పుకు కారణం ఏంటి? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ; లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా... ఈ మూడు మజిలీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్, ఎంజాయ్, రొమాంటిక్ గా సాగుతుంది. నరేషన్ కొద్దిగా స్లోగా ఉన్నా స్టోరీ పరంగా అది పెద్ద ఇష్యూ అనిపించదు. నాగచైతన్య క్రికెట్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లు ప్లస్ అయ్యాయి. లవ్, దివ్యాన్ష..నాగచైతన్య లిప్ కిస్ లాంటి సీన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ ఆటిట్యూడ్ లో బాగా పెర్ఫర్మ్ చేశాడు.ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది.
సెకండ్ హాఫ్ లో సమంత తన కెరీర్లోనే బెస్ట్ యాక్టింగ్ ను ఇచ్చింది. మధ్యతరగతి గృహిణిగా, భర్తను మార్చుకునే విధానంలో సమంత పడిన కష్టం తెరపై చూసి తీరాల్సిందే. నాగచైతన్య... సమంతల మధ్య పెద్దగా డైలాగులు లేవు. కానీ, ఇద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి.
నటీనటులు : హీరోగా నాగచైతన్య ప్రతీ సినిమాకు పరిణతి సాదిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్‌లో యువకుడిగా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో మెప్పించాడు. తొలి పరిచయంలోనే దివ్యాంశ కౌశిక్ మంచి నటనతో ఆకట్టుకుంది. కేవలం సెకండ్ హాఫ్‌లోనే కనిపించినా సమంత తన సూపర్భ్ పర్ఫామెన్స్‌తో అందరినీ డామినేట్ చేసేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో సమంత నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
పాజిటివ్ పాయింట్స్:మైనస్ పాయింట్స్ :
చివరిగా : మజిలీ సెంటిమెంట్ వర్కౌటైంది
Please submit your comments.