దుబారా ఖర్చులను కట్టడి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

Article

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా నూతన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. ‘నేను చూసాను. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు యువ ముఖ్యమంత్రి కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆసరా కల్పించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

దుబారా ఖర్చులను సీఎం వైఎస్‌ జగన్ కట్టడి చేశారని, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి జవాబుదారితనం ఉంటుందని, హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవని చంద్రబాబు ప్రభుత్వ దుబార ఖర్చును పరోక్షంగా ప్రస్తవించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదని మండిపడ్డారు.

Prev గంటా కు అపాయింట్‌మెంట్ ఇవ్వని జగన్
Next అధికారులతో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.