తెలంగాణ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. ఒకరేమో ఐఏఎస్ సీనియర్ అధికారి శ్రీలక్ష్మి, మరొకరేమో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర. శుక్రవారం జగన్‌ను శ్రీలక్ష్మి కలిశారు. తెలంగాణ కేడర్‌లో ఉన్న శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా తెలంగాణ కేడర్‌కు చెందిన హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నియామకం ఖరారయింది. ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ఈ ఆదేశాలు కూడా రాకముందే స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆయనతో పరిచయం చేసుకున్నారు. 30న జరగాల్సిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై స్టీఫెన్ రవీంద్ర సమీక్షించారు. నిఘా చీఫ్‌గా రవీంద్ర పేరు వెలువడటం నుంచి జగన్‌తో భేటీ అయ్యి, కార్యాలయ ప్రవేశం చేసేదాకా ఈ పరిణామాలన్నీ సోమవారంచకచకా జరిగాయి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్‌ఆర్ ఆంజనేయులును నియమించవచ్చునని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మరో ఇద్దరి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అనూహ్యంగా స్టీఫెన్ రవీంద్ర పేరు తెరపైకి వచ్చింది. ఆయన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. అప్పటినుంచి వైఎస్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన జగన్‌కు తెలిపారు.
Please submit your comments.