6గంటలు పబ్‌ జీ ఆడి గుండెపోటుతో మృతిచెందిన విద్యార్థి

Article
పబ్‌ జీ గేమ్ ఇప్పుడు యూత్‌ కు ఓ వ్యసనంలా మారింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు. ఇప్పటివరకు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.పబ్ జీ కి యువత వ్యసనమైపోవడంతో ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్ లైన్ వీడియోగేమ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ పబ్ జీ పిచ్చి పట్టి ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో మంగళవారం(మే 28) ఏకధాటిగా 6 గంటల పాటూ పబ్ జీ ఆడిన ఫుర్ఖన్ ఖురేషి(16) గుండెపోటుతో మరణించాడు.ఇంటర్మీడియట్ చదువుతున్న ఖురేషీ పబ్ జీ ఆడుతూ ఇతర ప్లేయర్లపై గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని అతడి తండ్రి తెలిపాడు.
Prev జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మి, ఏపీలో కీలక బాధ్యతలు?
Next అధికారులతో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.